నా కథ.. Part 1 - Cross Dressing Stories Telugu
Cross Dressing Stories Telugu
నా కథ.. Part 1
చిన్నప్పటి నుండి ఆడపిల్లలా తయారవ్వాలని ఎంతగానో ఉండేది..
నాకు ఊహ తెలియని వయసులో అమ్మాయిలకు ఉన్నట్టుగా పెద్ద జుట్టు దాదాపు నడుము వరకూ ఉండేది.. ఒకసారి మా అమ్మ నాకు మా చెల్లి గౌను, రెండు జడలు వేసి, కనకాంబరం పూలు పెట్టి స్టూడియోలో ఫోటో కూడా తీయించింది. ఇప్పటికీ నేను ఆ ఫోటో చూసుకుంటూ ఇపుడు కూడా అలా పెద్ద జుట్టు ఉంటే బాగుండు, అలా తయారైతే బాగుండు అనుకుంటాను.
అయినా నాకు తెలియకుండానే చిన్నప్పటి నుండి ఎప్పుడో అప్పుడు సమయం దొరికినప్పుడల్లా మా చెల్లిల్ల( నా వయసున్న పిన్ని కూతుళ్లు) బట్టలు వేసుకోవడం చేసే వాడిని..
మా ఊరికి దగ్గరలోనే ఇంకో ఊరిలో మా పిన్ని వాళ్లు ఉండే వారు.. మా పిన్నికి ముగ్గురు పిల్లలు.. ఒక అబ్బాయి, ఇద్దరు అమ్మాయిలు.. అందులో పెద్ద అమ్మాయి నేను నెల రోజుల తేడాతో పుట్టాము.. ఇద్దరం ఒకేలా ఉండే వాళ్లం.. తన డ్రస్సులు అన్ని నాకు సరిగ్గా సరిపోయేవి. అప్పుడప్పుడు మా అమ్మ తనకి డ్రస్సులు కొనాలి అనుకుంటే నన్ను షాప్ కి తీసుకెళ్ళి నాకు సరిపోయేవి చూపించమని అడిగేది. నాకు పెట్టి సరిగా సరిపోయిందా లేదా అని చూసేది. అపుడు మనసులో అనుకునే వాడిని ట్రైయల్ కూడా చూడమంటే బాగుండు అని... నేను ప్రతీ శని వారం స్కూల్ నుండి రాగానే వాళ్ళ ఊరికి వెళ్ళే వాడిని. ఆదివారం అంతా అక్కడ వాళ్ళతో ఉండి మళ్లీ సోమవారం స్కూల్ టైంకి మా ఊరికి వచ్చే వాడిని.. అలా అక్కడికి వెళ్ళినపుడు ఎవరూ లేని టైంలో తన డ్రెస్ వేసుకోవడం చేసే వాడిని. ఒక సారి ఏదో ఫంక్షన్ కోసం మా పిన్ని చెల్లి కోసం సవరం కొన్నది. అది చూసినప్పటి నుండి నేను ఎప్పుడూ డ్రస్సులు వేసుకోవడమేనా ఈ సారి జడ కూడా వేసుకోవాలి అని సమయంకోసం ఎదురు చూస్తూనే ఉన్నా.. అపుడే నాకోసమే అనుకున్నట్టు మా పిన్ని కొత్తగా ఒక జాబ్ లో జాయిన్ అయింది. ఇక ఇదే మంచి అవకాశం అనుకొని శని వారం వెళ్ళి ఆది వారం అంతా వాళ్ళతో ఆడుతూ ఎంజాయ్ చేసి సోమవారం పొద్దున్నే మా ఇంటికి రాకుండా ఏదో కారణం చెప్పి వాళ్లిట్లోనే ఉన్నా.. మా అన్నయ్య, చెల్లెల్లు స్కూల్ కి వెల్ళారు. మా పిన్ని తనతో ఆఫీసుకు రమ్మంది కానీ నేను ఒక్కడినే ఉంటాను. బోర్ కొడితే నేను వస్తాను నాకు మీ ఆఫీసు తెలుసు అని తనతో వెళ్ళకుండా ఇంట్లోనే ఉన్నాను..
ఇక ఎక్కడి వాళ్ళు అక్కడికి వెళ్లగానే స్నానం చేసి, తలుపులు అన్నీ పెట్టుకొని అన్ని వెతకడం ప్రారంభించాను.. కాసేపటికి దొరికింది నా కలల సవరం.. వెంటనే లేటు చేయకుండా బీరువాలోనుండి పట్టు లంగా ఓణి తీసుకొని వేసుకున్నా.. నా జుట్టుని చిన్న పిలకలా వేసి దానికి సవరం పెట్టి జడలా వేసుకున్నా. దానికి లంగాకి మ్యాచ్ అయే రబ్బర్ బాండ్, ఇంట్లో గులాబీ చెట్టుకు ఉన్న ఒక పువ్వు తెంపుకొని పెట్టుకున్నా.. తర్వాత గాజులు, ఒడ్డానం, చెవులకు చిన్న చెల్లి కోసం కొన్న ప్రెస్సింగ్ కమ్మలు, ముక్కుకి సింగిల్ స్టోన్ బొట్టుబిల్ల, కళ్ళకి కాటుక, కాళ్ళకి పట్టీలు ఇలా పూర్తి అమ్మాయిలా మారిపోయా..
అపుడు ఇంకా సెల్ ఫోన్స్ రాలేదు.. వచ్చి ఉంటే ఎన్ని సెల్పీలు దిగే వాదానినో.. అలా లంగా ఓణీలో మురిసి పోతూ.. మధ్యాహ్నం వరకూ ఉన్నా.. మధ్యానం లంచ్ కి స్కూల్ నుండి అన్నయ్య, చెల్లి వాళ్ళు వస్తారని అన్నీ ఎక్కడివి అక్కడ సదిరి మళ్లీ నా డ్రస్ వేసుకొని అబ్బాయిలా మారిపోయా..
ఇంకా ఉంది...
Comments
Post a Comment