నా కథ.. Part 2 - Cross Dressing Stories Telugu



నా కథ.. Part  2  - Cross Dressing Stories Telugu

 

అలా సమయం దొరికినప్పుడు పిన్ని వాళ్లింటికి వెళ్ళడం.. కుదిరితే అమ్మాయిలా మారిపోవడం.. కొన్ని రోజులకు పిన్ని వాళ్లు ఆ ఊరి నుండి వేరే ఊరికి మారడం వల్ల నా కోరిక అలా లోపలే ఉండిపోయింది.

 

ఇక చేసేది ఏమీ లేక అబ్బాయిగానే కాలం గడుస్తుంది.

డిగ్రీ అయ్యాక ఏదైనా కోర్సు చేద్దామని హైదరాబాద్ కి వచ్చాను..

వచ్చే ముందు రూం తీసుకున్నాక ఒక్కడినే రోజూ అమ్మాయిగానే ఉండాలి. ఇన్స్ట్యూట్ కి వెళ్లి రాగానే అమ్మాయిగా మారిపోవాలి. అని కలలు కనే వాడిని కానీ హైదరాబాద్ లో ఉన్నన్ని రోజులు అవి కలలుగానే ఉండిపోయాయి. సరైన ఉద్యోగం దొరకక, దొరికినా నచ్చక ఇక్కడ ఉండి ఖర్చులు పెంచుకోవడం కటే ఇంటికి వెళ్లిపోవడమే మంచిది అనుకొని ఇంటికి వెళ్లిపోయా...

నాకు చిన్నప్పటి నుండి కంప్యూటర్స్ అంటే ఇంట్రెస్ట్ ఎక్కువ.. ఇంటర్ లో ఉండగానే పట్టుబట్టి కంప్యూటర్ కొనుక్కున్నా.. మెల్లిగా సొంతంగా ఫోటోషాప్ నేర్చుకున్నా.. రాత్రి అందరూ పడుకున్నాక నా ఫోటోలని అమ్మాయిలా చేసుకునే వాన్ని.. ఎలాగూ డ్రెస్ వేసుకునే అవకాశం లేదు. కనీసం నా ఫోటోస్ అయినా అలా చేసుకొని నేను అమ్మాయిగా పుడితే అలా ఉండే దానిని అనుకొని ఆనంద పడే వాడిని.

 

హైదరాబాద్ నుండి వచ్చాక నా లైఫ్ లో టర్నింగ్ పాయింట్...

అపుడే ఒక అమ్మాయి పరిచయం అయింది.. ఇక రొటీన్ స్టోరీ.. లవ్...

కొన్నిరోజులు అమ్మాయి నేను ఫుల్ గా తిరగటం, సినిమాలు, లాంగ్ డ్రైవ్ లు.. కానీ అందరిలాగే నాది కూడా RX100 స్టోరీ అయింది.(RX100 చూసినప్పుడు నా స్టోరీనే సినిమా తీసారా అనుకున్నా)

కొన్నిరోజులు కాదు కాదు సంవత్సరాలు నేను ఇంట్లోనే ఉంటూ ఎడుస్తూ కూర్చున్నా.. తర్వాత మెల్లిగా నా లైఫ్ లోకి ఎంటర్ అయింది నా Ex వాళ్ల చెల్లి..

బావా ఏంటి ఎలా ఉన్నావు.. అని. మెసేజ్ చేయడం.. అన్నీ మర్చిపో అని ఏదో ఒకటి మాట్లాడి నన్ను మాములు స్థితిలోకి తీసుకురావడానికి ట్రై చేసింది..

నేను కూడా తనతో మామూలుగానే మాట్లాడుతూ (వాళ్ళ అక్క గురించి ఎక్కువ మాటలు ఉండేవి) కాస్త బయటి ప్రపంచంలోకి వచ్చాను.

ఒకరోజు నేను ఒక్కడినే ఇద్దరిగా ఉన్నట్టు చేసుకున్న ఫోటో ఒకటి చూసి తను బావా అసలు ఫోటో షాప్ లో చేసావు అంటే నమ్మేలా లేదు నిజంగా నే నీకు తమ్ముడు ఉన్నాడా?” అని అడిగింది.

అలా ఏదో ఏదో మాట్లాడుతూ అలా డబుల్ యాక్షన్ తో ఒక వీడియో కూడా చేయొచ్చు కదా బావా అంది.

హా చేయొచ్చు కానీ దాంట్లో ఏముంది. పెద్దగా చేసేది ఏముండదు సినిమాల్లో చేస్తున్నారు కదా అలాగే ఉంటుంది. అన్నాను..

అలా కాదు బావా.. నువ్వే ఒక అమ్మాయిగా గెటప్ వేసుకో.. నువ్వే మేల్ గెస్ట్ గా, ఫీమేల్ యాంకర్ గా ఉంటూ ఇంటర్వూ చేసినట్టు చేయి కొంచం డిఫెరెంట్ గా ఉంటుంది అంది.

ఒక్కసారిగా లవ్ ఫెయిల్యూర్ లో పడి మరుగున పడ్డ నాలోని అమ్మాయి నిద్రలేచింది. ఇక నా ఆనందానికి హద్దులు లేవు.. అదేంటో తెలియదు కానీ ఫోన్ మెసేజ్ లోనే తనకి నా ఆనందం కనిపించిందేమో.. అప్పటి నుండి రెండు మూడు రోజులు నిన్ను ఇలా తయారు చేయాలి, అలా తయారు చేయాలి అని నేను ఎనా అయితే కలలు కనే దానినో అలా తన మాటలతో నా కలలకి రూపం పోసేది. అలా కొన్ని రోజులు మా మధ్య గర్లీ చాట్స్ నడిచాయి. ఒక రోజు నాకు అలా మాట్లాడటం నచ్చుతుందనో, ఎప్పటికీ గర్లీ చాట్స్ చేస్తున్నాననో తెలియదు. నన్ను బావ అని పిలకుండా వదిన అని పిలిచింది. వదిన అనగానే నాకు ఏదో ఒక ఫీలింగ్.. బావా ఇక నుండి నువ్వు నా వదినవి. ఎప్పటికీ అలాగే పిలుస్తాను నీకు ఓకే నా అంది. నాకు ఫుల్ హాపీ.. వెంటనే ఓకే అన్నా.. బావా మనకి ఎప్పుడు టైం దొరుకుతుంది. నిన్ను వదినగా ఎప్పుడు రెడీ చేయాలి అని ఎప్పటికీ అనేది. నాక్కూడా ఎప్పుడు ఆ టైం వస్తుంది అని ఉండేది. కానీ నా Ex తో జరిగిన దాంతో మేము కలవకుండా అయింది. తనకు నన్ను ఒంటరిగా కలిసే అవకాశం లేకుండా పోయింది. కానీ ఒకరోజు..

 

ఇంకా ఉంది...

Comments

  1. Story baaga interesting ga undhi... continue fast...

    ReplyDelete

Post a Comment

Popular Posts