నా కథ.. Part 2 - Cross Dressing Stories Telugu
నా కథ.. Part 2 - Cross Dressing Stories Telugu అలా సమయం దొరికినప్పుడు పిన్ని వాళ్లింటికి వెళ్ళడం.. కుదిరితే అమ్మాయిలా మారిపోవడం.. కొన్ని రోజులకు పిన్ని వాళ్లు ఆ ఊరి నుండి వేరే ఊరికి మారడం వల్ల నా కోరిక అలా లోపలే ఉండిపోయింది. ఇక చేసేది ఏమీ లేక అబ్బాయిగానే కాలం గడుస్తుంది. డిగ్రీ అయ్యాక ఏదైనా కోర్సు చేద్దామని హైదరాబాద్ కి వచ్చాను.. వచ్చే ముందు రూం తీసుకున్నాక ఒక్కడినే రోజూ అమ్మాయిగానే ఉండాలి. ఇన్స్ట్యూట్ కి వెళ్లి రాగానే అమ్మాయిగా మారిపోవాలి. అని కలలు కనే వాడిని కానీ హైదరాబాద్ లో ఉన్నన్ని రోజులు అవి కలలుగానే ఉండిపోయాయి. సరైన ఉద్యోగం దొరకక, దొరికినా నచ్చక ఇక్కడ ఉండి ఖర్చులు పెంచుకోవడం కటే ఇంటికి వెళ్లిపోవడమే మంచిది అనుకొని ఇంటికి వెళ్లిపోయా... నాకు చిన్నప్పటి నుండి కంప్యూటర్స్ అంటే ఇంట్రెస్ట్ ఎక్కువ.. ఇంటర్ లో ఉండగానే పట్టుబట్టి కంప్యూటర్ కొనుక్కున్నా.. మెల్లిగా సొంతంగా ఫోటోషాప్ నేర్చుకున్నా.. రాత్రి అందరూ పడుకున్నాక నా ఫోటోలని అమ్మాయిలా చేసుకునే వాన్ని.. ఎలాగూ డ్రెస్ వేసుకునే అవకాశం లేదు. కనీసం నా ఫోటోస్ అయినా అలా చేసుకొని నేను అమ్మాయిగా పుడితే అలా ఉండే దాన...