నా బ్లాగ్...

నాకు అమ్మాయిలా తయారవ్వాలని.. అలాగే ఉండాలనేది ఒక పెద్ద తీరని కోరిక..

ఒక నాకే కాదు అలాంటి ఆశ ఉన్న వారు ఎంతో మంది ఉన్నారు.. కానీ ధైర్యం చేసి పైకి చెప్పుకోలేక.. ఎవరూ లేని సమయంలో ఒంటరిగా ఉన్నప్పుడు ఇంట్లో వాళ్ల చీరలు, డ్రెస్సులు వేసుకొని ఆనంద పడుతూ కాలం గడుపుతూ ఉంటారు.

ఇలాంటి వారిలో పూర్తి స్థాయిలో అమ్మాయిలా మారి, తనకీ ఒక భర్త, పిల్లలు ఉండాలి అనుకునే వారు కొందరైతే కేవలం అమ్మాయిలా తయారవ్వాలనుకునే వారు కొందరు..

పూర్తిగా అమ్మాయిలా మారితే సమాజంలో ఉండే చిన్నచూపు వల్ల పడే ఇబ్బందులు ఎదుర్కోలేక ఎందరో బాధపడుతూనే ఉన్నారు.

అది అలా ఉంటే..

బయటి ప్రపంచానికి మగవారిలా ఉంటూ.. తనకు తాను ఆడదానిగా ఊహాలోకాల్లో విహరించేవారే ఎక్కువ..

వారు అప్పుడప్పుడు ఎవరికీ తెలియకుండా ఆడవారిలా తయారవ్వడం.. క్రాస్ డ్రెస్సింగ్ కథలు చదవటం.. ఫోటోలు, వీడియోలు చూడటం.. అందమైన అమ్మాయిలు కన్పిస్తే నేనూ అలా ఉంటే బాగుండు అనుకొని వారిలా నేనుంటే ఎలా ఉంటుంది.. అలాంటి జడ నాకుంటే బాగుండు.. అలాంటి చీర నేను కూడా కట్టుకుంటే బాగుండు.. అంటూ.. పూలు, గాజులు, కాళ్ల పట్టీలు.. ఇలా అన్నీ తాను పెట్టుకుంటున్నట్టుగా ఆలోచనలో పడేవారు ఎందరో ఉన్నారు..

అలాంటి వారందరికోసం నా బ్లాగ్..

Comments

Popular Posts